Chinna Movie | ఓటీటీలోకి రాబోతున్న సిద్ధార్థ్ ‘చిన్నా’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే.?
Chithha Movie | తెలుగు తెరపై బాయ్స్ (Boys), నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు (Bommarillu) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు సిద్ధార్థ్ (Siddarth). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం చిత్తా (Chithha).
Chithha Movie | తెలుగు తెరపై బాయ్స్ (Boys), నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు (Bommarillu) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు సిద్ధార్థ్ (Siddarth). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం చిత్తా (Chithha). నిమిషా సజయన్ (Nimisha Sajayan) కథానాయికగా నటించింది. సేతుపతి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 28న తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను చిన్నా(Chinna) అనే పేరుతో తెలుగులో అక్టోబర్ 06న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు సిద్దూ కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అన్నారు విమర్శకులు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే చిత్రంగా ఈ సినిమా ఉంది.. సడన్‌గా తన కూతురు కిడ్నాప్ అవ్వగా.. కూతురు కోసం సిద్ధార్థ్ చేసే పోరాటమే ఈ సినిమా. ఇక ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

