న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ జొకోవిచ్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 4-6, 4-6, 6-1, 6-1, 6-3 తేడాతో లాస్లో జెరె(సెర్బియా)పై గెలిచాడు.
తొలి రెండు సెట్లను ప్రత్యర్థికి చేజార్చుకున్న జొకో..వరుసగా మూడు సెట్లలో మ్యాచ్‌ను తన వశం చేసుకున్నాడు.