Novak Djokovic | నా కెరీర్ బెస్ట్ సీజన్లలో ఇదొకటి.. కొత్త ఏడాదిలోనూ జోరు కొనసాగిస్తా : జకోవిచ్
Novak Djokovic : సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) రికార్డు స్థాయిలో మరో ఏడాదిని నంబర్ 1 గా ముగిస్తున్నాడు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(Grandslam Title) కొల్లగొట్టిన జకో.. పురుషుల టెన్నిస్ చరిత్రలో 24 గ్రాండ్‌స్లామ్...
Novak Djokovic : సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) రికార్డు స్థాయిలో మరో ఏడాదిని నంబర్ 1 గా ముగిస్తున్నాడు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(Grandslam Title) కొల్లగొట్టిన జకో.. పురుషుల టెన్నిస్ చరిత్రలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న జకో.. ఈ ఏడాది తన కెరీర్‌లోని బెస్ట్ సీజన్లలో ఒకటిగా పేర్కొన్నాడు.
‘నా కెరీర్లో 2023 ఒక బెస్ట్ సీజన్. అయితే.. ఇదే అత్తుత్తమం అని చెప్పలేను. గతంలోనూ నేను ఒక ఏడాదిలో మూడు, అంతకంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్స్ గెలిచాను. ఎన్నో మ్యాచుల్లో విజయం సాధించాను. ఈసారి దాదాపు 11 టోర్నమెంట్లు ఆడాను. వింబుల్డన్ నుంచి నేను ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. కోర్టులో నేను చురుకుగా కదులుతున్నా. నిజంగా బాగా ఆడుతున్నా’ అని జకోవిచ్ తెలిపాడు.
History-maker. Record-breaker ⭐️⭐️
🏆 @DjokerNole #NittoATPFinals pic.twitter.com/nXCkjBVIKC
— ATP Tour (@atptour) November 19, 2023
ఆస్ట్రేలియా ఓపెన్‌తో టైటిళ్ల వేట మొదలెట్టిన జకో.. యూఎస్ ఓపెన్‌తో ముగించాడు. ఫ్రెంచ్ ఓపెన్(French Open 2023) ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) చేతిలో కంగుతిన్న జకోవిచ్.. వింబుల్డన్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. దాంతో, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లో రఫెల్ నాదల్(Rafeal Nadal) రికార్డు బద్ధలు కొట్టాడు.

అదే ఊపులో యూఎస్ ఓపెన్‌లోనూ చెలరేగిన జకోవిచ్ ట్రోఫీ విజేతగా నిలిచాడు. ఇదే జోరును వచ్చే సీజన్లోనూ కొనసాగించాలని ఈ సెర్బియా స్టార్ భావిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024)లో జకో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీతో నాదల్, నవామి ఒసాకా పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Actor Prithviraj | అంబటి ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికివస్తారు : నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tripti Dimri | నిద్రలేని రాత్రులను గడుపుతున్నా.. యానిమల్ భామ తృప్తి డిమ్రి కామెంట్స్ వైరల్
- KTR | వరి ధాన్యం ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచినం: కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

