FIFA World Cup | ఫిఫా ప్రపంచకప్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్‌పై కన్నేసిన జట్లు ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ సందడి చేసింది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసేసింది.
ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా అల్ బిదా పార్క్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో నోరా పాల్గొంది. ఈ సందర్భంగా సెంటర్ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టేజ్‌పై డ్యాన్స్ చేసి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. సిల్వర్ కలర్ కాస్ట్యూమ్స్ ధరించిన నోరా.. పలు పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి దేశీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ప్రేక్షకులు సైతం నోరా డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. చప్పట్లు, ఈలలతో నోరాను ఎంకరేజ్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.