PAK vs SL | కొలంబో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌటైన లంక.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. అబ్దుల్లా షఫీక్ (201), ఆగా సల్మాన్ (132) దంచికొట్టడంతో పాకిస్థాన్ 576/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. లంక రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది.
సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (63 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో నోమాన్ అలీ 7 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. అబ్దుల్లా షఫీక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ఆగా సల్మాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. తొలి టెస్టులోను లంకపై పాకిస్థాన్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.