Azharuddin | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు తన పేరును తొలగించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మాట్లాడుతూ.. తాను భారత జట్టుకు సారథిగా పదేండ్లు, 19 ఏండ్ల పాటు జాతీయ జట్టుకు సేవలందించాలనని అన్నారు.
కొంతమంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్ క్రికెట్ క్లబ్‌తో కోర్టులో పిటిషన్లు వేయించారని చెప్పారు. ఒక హైదరాబాదీగా దేశం గర్వంచే స్థాయిలో తాను ఎదిగానని.. కానీ కొంతమంది చేస్తున్న కుట్రలను న్యాయపరంగా ఎదుర్కుంటానని తెలిపారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని ఆయన చెప్పారు. హెచ్‌సీఏలో సైతం ఎన్నో విభేదాలున్నాయని అజారుద్దీన్ అన్నారు.