హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ పోటీలు హోరీహోరీగా సాగుతున్నాయి. మూడో రోజైన గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో మీరాబ లువాంగ్ 21-9, 21-7తో సిద్ధార్థ మిశ్రాపై గెలిచి ముందంజ వేశాడు.
మిగతా మ్యాచ్‌ల్లో సాయిచరణ్ 21-11, 21-10తో హిమాంశుదాస్పై, చిరాగ్‌సేన్ 21-14, 21-19తో లాల్ తజులాపై, తరుణ్ 21-15, 6-21, 21-17తో రాహుల్ భరద్వాజ్‌పై విజయాలు సాధించారు. అంతకుముందు టోర్నీని మంత్రి శ్రీధర్‌బాబు అధికారికంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.