World Boxing Championship : భారత స్టార్ నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ (World Boxing Championship) సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 51 కిలోల విభాగంలో జోరు చూపిస్తున్న నిఖత్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన యునా నిషినకాను(Yuna Nishinaka) చిత్తు చేసింది. ఈ విజయంతో మూడో పతకానికి మరింత చేరువైంది ఇందూరు బిడ్డ. ఫైనల్ బెర్తు కోసం బుసే నాజ్ కకిరోగ్లు(టర్కీ)తో నిఖత్ తలపడనుంది.
రెండుసార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలుపొందని నిఖత్ ఈసారి కూడా అదరగొడుతోంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఆమె పదహారో రౌండ్లో ఏకపక్షంగా గెలుపొందింది. కానీ, క్వార్టర్ ఫైనల్లో నిషినకాను.. నిఖత్‌కు గట్టిపోటీనిచ్చింది. ఇద్దరూ హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
🚨 NIKHAT ZAREEN INTO THE QUARTERFINALS!
She beats Nishinaka Yuna 🇯🇵 5-0 in Women’s 51 kg at World Boxing Championship!
Just 1 win away from the Historic Medal! 🤩💪 pic.twitter.com/5UJprH8VFr
— The Khel India (@TheKhelIndia) September 9, 2025
తొలి రౌండ్లో జపాన్ బాక్సర్ 3-2తో ఆధిక్యం సాధించింది. అయితే.. రెండో రౌండ్లో నిఖత్ పంచ్‌ల వర్షం కురిపించి 4-1తో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మూడో రౌండ్లోనూ జోరు చూపించిన మాజీ ఛాంపియన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో రెండు రజతాలు సాధించిన బుసె నాజ్ రూపంలో నిఖత్ కఠిన సవాల్ ఎదురుకానుంది.