చెన్నై : చెన్నై చెస్ గ్రాండ్‌మాస్టర్స్ టైటిల్ రేసులో ఉన్న తెలంగాణ తేజం అర్జున్ ఇరిగేసికి ఈ టోర్నీ నాలుగో రౌండ్లో షాక్ తగిలింది. వరుస విజయాలతో రెండో స్థానంలో ఉన్న అర్జున్‌కు నాలుగో రౌండ్లో భారత్‌కే చెందిన నిహాల్ సారిన్ చేతిలో ఓటమి ఎదురైంది.
ఆదివారం ఇక్కడ జరిగిన నాలుగో రౌండ్లో తెల్లపావులతో ఆడిన నిహాల్.. 70 ఎత్తుల్లో అర్జున్‌పై విజయం సాధించాడు. గత రెండు మ్యాచ్‌లలో అపజయం పాలైన నిహాల్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి విజయం. ఇదిలాఉండగా జర్మనీకి చెందిన విన్సెంట్ కెమర్.. నాలుగో గేమ్‌ను డ్రా చేసుకుని 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు.