IND vs ENG : నైట్ వాచ్‌మన్ అంటే వికెట్ కాపాడుకొని జట్టును ఆదుకుంటారు. కొన్నిసార్లు.. క్రీజులో పాతుకుపోయి సెంచరీలు బాదిన ఆటగాళ్లూ ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)కూడా ఆ జాబితాలో చేరడం ఖాయమనిపిస్తోంది. ఓవల్ టెస్టులో.. రెండు వికెట్లు పడ్డాక.. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ హాఫ్ సెంచరీతో విజృంభించాడు. తొలి సెషన్లో ఇంగ్లండ్ పేసర్ల బౌన్సర్లను కాచుకొని క్రీజులో నిలిచిన అతడు.. అట్కిన్సన్ ఓవర్లో బౌండరీలతో కెరీర్లో మొదటి అర్ధ శతకం నమోదు చేశాడు.
తద్వారా నైట్‌వాచ్‌మన్‌గా ఫిఫ్టీ కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. 2011లో అమిత్ మిశ్రా (Amit Mishra) ఇంగ్లండ్ పైనే 84 రన్స్ బాదాడు. ఆకాశ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే బాల్కనీలోని భారత కెప్టెన్ గిల్, ఇతర ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ఆకాశ్‌ను అభినందించారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే కోచ్ గౌతం గంభీర్ సైతం నవ్వాడు.
India’s nighthawk 😎 https://t.co/rrZF1qeH0S | #ENGvIND pic.twitter.com/QfIFY8MgMU
— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2025
బర్మింగ్హమ్ టెస్టులో 9 వికెట్లతో ఇంగ్లండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్ దీప్ ఓవల్‌లో తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. సాయి సుదర్శన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు.. మూడో రోజు తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. ఇంగ్లండ్ పేస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కోవడమే కాదు ఏకంగా అర్ధ శతకం కూడా సాధించాడీ పేసర్. అట్కిన్సన్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు ఆకాశ్. ఇంతకుముందు టెస్టుల్లో తన అత్యధిక స్కోర్ 31ను అధిగమించిన ఆకాశ్.. చిరస్మరణీయ హాఫ్ సెంచరీతో ఔరా అనిపించాడు.