Pullela Gopichand | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ శిక్షణాసంస్థ అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ క్రమశిక్షణకు మారుపేరని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా సానబెట్టుకునేందుకు అలెన్ మంచి వేదికన్నారు. అలెన్ సంస్థ హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా శనివారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గోపిచంద్ పాల్గొని మాట్లాడారు. హెచ్సీఏ అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ జగన్మోహన్రావు మాట్లాడుతూ.. అలెన్-అక్షర విద్యాసంస్థలు కలిసి పనిచేయనున్నాయన్నారు. అలెన్ సంస్థల సీఈవో నితిన్ కుక్రేజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.