IPL 2023 : ప్లే ఆఫ్స్ రేసుకు కీలకమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్(58 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో లక్నో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 73 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయిన లక్నో 170 కొట్టిందంటే అందుకే పూరన్ కారణం. దంచికొట్టిన పూరన్, ఆయుష్ బదోని(25)తో కలిసి ఆరో వికెట్‌కు 50 ప్లస్ రన్స్ జోడించాడు. రస్సెల్ వేసిన 20వ ఓవర్లో కృష్ణప్ప గౌతమ్(11 నాటౌట్) సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, లక్నో పోరాడగలిగే అందించాడు.
6️⃣6️⃣ & O.U.T@imShard bounces back in style 😎#TATAIPL | #KKRvLSG https://t.co/2tNv4zospG pic.twitter.com/I5CNXEs7Dh
— IndianPremierLeague (@IPL) May 20, 2023
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కరన్ శర్మ(3) తక్కువకే ఔటయ్యాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా ఒకే ఓవర్లో ప్రేరక్ మన్కడ్(26), మార్కస్ స్టోయినిస్(0)ని డకౌట్ చేశాడు. కష్టాల్లో పడిన లక్నోను కెప్టెన్ కృనాల్ పాండ్యా(9), క్వింటన్ డికాక్(28) ఆదుకున్నారు. వీళ్లు ఔటయ్యాక పూరన్, బదోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.