ODI World Cup | బంగ్లాదేశ్ విధించిన టార్గెట్ను న్యూజిలాండ్ అలవోకగా చేధించింది. ప్రపంచ కప్ టోర్నీ-2023లో భాగంగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో శుక్రవారం చెన్నై చేపాక్ స్టేడియం వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. 246 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 43 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.
39వ ఓవర్లో న్యూజిలాండ్ సారధి కానే విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్ అయినా తర్వాత వచ్చిన బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి డేరీ మిచెల్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన నాలుగో బంతి.. ఓపెనర్ రచిన్ రవీంద్రా బ్యాట్ ఎడ్జి మీదుగా వికెట్ కీపర్ ముషిఫికర్ రహీం చేతుల్లో పడటంతో రచిన్ రవీంద్రా పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు రెండు ఫోర్లతో రచిన్ రవీంద్రా మెరుపులు మెరిపించాడు. రెండో వికెట్ భాగస్వామ్యానికి విలియమ్సన్తో కలిసి డీపీ కాన్వే 50 పరుగులు జత చేశారు. కానే విలియమ్సన్ రిటైర్డ్ హార్ట్ కావడంతో మిగతా పని డీజే మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ పూర్తి చేశారు.