అదే ఆట తీరు. అదే బౌలింగ్.. అదే స్ట్రాటజీ. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఏ స్ట్రాటజీని అయితే పాక్ ఫాలో అయిందో అదే ఊపుతో న్యూజిలాండ్‌ను తన బౌలింగ్‌తో పాక్ కట్టడి చేయగలిగింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ మరోసారి తన సత్తా చాటింది. న్యూజిలాండ్‌ను బౌలింగ్‌తో కట్టిపడేసింది. దీంతో 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది న్యూజిలాండ్.
తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎక్కువ పరుగులు చేయకుండా పాక్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. డెవన్ కాన్వే ఒక్కడే 27 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
మిట్చెల్ కూడా 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. గప్తిల్ 20 బంతుల్లో 17 పరుగులు, ఫిలిప్స్ 15 బంతుల్లో 13 పరుగులు చేయగా.. చివరి బంతికి మిట్చెల్ సాంత్నర్‌ను హరిశ్ రౌఫ్ తన బౌలింగ్‌లో ఔట్ చేశాడు. దీంతో సాంత్నర్ 5 బంతుల్లో 6 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ బౌలర్లలో హరిశ్ రౌఫ్ 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసుకున్నాడు. షాహీన్ షా అఫ్రిదీ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకోగా.. ఇమాద్ వాసిమ్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్, మహమ్మద్ హఫీజ్ 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు.
Another day, another sizzling performance from the Pakistan bowlers 🔥
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
They restrict New Zealand to 134/8.
Will their batters get the job done? #T20WorldCup | #PAKvNZ | https://t.co/rpw034CkPm pic.twitter.com/4LcY3wZun6
Conway goes for a lofted shot against Rauf but only finds Babar Azam in the deep 🤲
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
His knock of 27 comes to an end. #T20WorldCup | #PAKvNZ | https://t.co/rpw034CkPm pic.twitter.com/VvkJziwqkN
Imad Wasim gets his retribution ☝️
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
After being hit for a six, he gets Daryl Mitchell the very next delivery.
He is gone for 27!#T20WorldCup | #PAKvNZ | https://t.co/rpw034kJXO pic.twitter.com/LQ64oLt65X