గత ప్రపంచకప్‌లో తుది మెట్టుపై బోల్తా పడిన న్యూజిలాండ్.. ఈ సారి కప్పు కొట్టాలని పట్టుదలగా కనిపిస్తున్నది. తొలి మ్యాచ్ లో నిర్దాక్షిణ్యమైన ఆట తీరుతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్.. ఉప్పల్ వేదికగా జరిగిన తమ రెండో పోరులో నెదర్లాండ్స్‌ను చెడుగుడు ఆడుకుంది.
మొదట బ్యాటింగ్‌లో టాప్-5 రాణిస్తే.. ఆఖర్లో శాంట్నర్ మెరుపు షాట్లతో డచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడా పెడా బౌండ్రీలతో కివీస్ కు భారీ సోరు సాధించిపెట్టాడు. ఇక బ్యాటింగ్ లో నెదర్లాండ్స్ కాస్త పోరాడినా.. బాల్‌తోనూ శాంట్నర్ మ్యాజిక్ చేశాడు. గింగిరాలు తిరిగే బంతులతో ఒకరి తర్వాత ఒకరిని పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా ప్రతిష్ఠాత్మక టోర్నీలో న్యూజిలాండ్ రెండో విజయం ఖాతాలో వేసుకుంది.
CWC | హైదరాబాద్, ఆట ప్రతినిధి: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జోరు కొనసాగిస్తున్నది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. మలి పోరులో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. సోమవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. మెగాటోర్నీలో కివీస్‌కు ఇది రెండో విజయం కాగా.. డచ్ జట్టుకు రెండో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యాంగ్ (70; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ లాథమ్ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్), రచిన్ రవీంద్ర (51; 3 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో మిషెల్ శాంట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ భారీ సోరు చేసింది.
నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, మీకెరెన్, వాన్‌డెర్ మెర్వ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. కొలిన్ అకెర్మన్ (69; 5 ఫోర్లు) టాప్ సోరర్ కాగా.. కెప్టెన్ సాట్ ఎడ్వర్డ్స్ (30; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సైబ్రాండ్ (29), తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (21, 2 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. నాణ్యమైన బౌలింగ్ ను ఎదురోలేక మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ 3 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఉప్పల్‌లో ఒక బౌలర్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శాంట్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దకింది. ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం మరోసారి డబుల్ హెడర్ జరుగనుంది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్ తో ఇంగ్లండ్.. హైదరాబాద్ లో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనున్నాయి.
భారీ సోరు కండ్ల ముందు కనబడుతున్నా.. నెదర్లాండ్స్ పోరాట పటిమతో ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డచ్ జట్టు.. గత మ్యాచ్ మాదిరే.. ఈ సారి కూడా కడదాకా పట్టు వీడలేదు. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (12), మ్యాక్స్ డౌడ్ (16) తకువ సోరుకే ఔటైనా.. కొలిన్ అకర్మెన్ ఆకట్టుకున్నాడు. సింగిల్స్ తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. పాకిస్థాన్ పై అర్ధ శతకంతో ఆకట్టుకున్న డి లీడ్ (18) విఫలం కాగా.. తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు ఎకువసేపు నిలవలేకపోయాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో ఆ జట్టు ఒత్తిడికి లోను కాగా.. కివీస్ ఆల్ రౌండర్ శాంట్నర్ తన స్పిన్ తో డచ్ ప్లేయర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన ఈ కివీస్ స్పిన్నర్ నెదర్లాండ్స్ నడ్డి విరిచాడు. చివర్లో సాట్ ఎడ్వర్ట్స్, సైబ్రాండ్ (29) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది.
1 ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఒక బౌలర్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. ఇంతకుముందు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇకడ నాలుగు వికెట్లు తీశాడు.
ఉప్పల్ వేదికగానే ఆడిన తొలి మ్యాచ్ లో తమ పోరాటంతో ఆకట్టుకున్న నెదర్లాండ్స్.. ఈ సారి టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వేడి వాతావరణంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దకింది. గత మ్యాచ్ సెంచరీ హీరో కాన్వే (32; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి విల్ యాంగ్ జట్టుకు గట్టి పునాది వేశాడు. చిన్న బౌండ్రీల మైదానంలో వీరిద్దరూ ధాటిగా ఆడగా.. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం కాన్వే ఔటయ్యాడు. స్పిన్నర్‌గా జట్టులో చోటు దకించుకొని వన్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్న రచిన్ రవీంద్ర వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన జోరు కనబర్చాడు. తొలి పోరులో ఇంగ్లిష్ బౌలర్లను అలవోకగా ఎదురొంటూ.. అజేయ సెంచరీ బాదిన రచిన్.. నెదర్లాండ్స్ బౌలర్లను కూడా ఓ ఆటాడుకున్నాడు. అయితే భారీ సోర్లు చేస్తారనుకున్న యాంగ్, రచిన్ అర్ధశతకాల తర్వాత ఔట్ కాగా.. డారిల్ మిషెల్, టామ్ లాథమ్ రాణించడంతో 40 ఓవర్లలో న్యూజిలాండ్ 238/4తో నిలిచి మరింత భారీ సోరు చేసేలా కనిపించినా.. ఆఖర్లో డచ్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక గగనమైంది. అయితే చివరి మూడు ఓవర్లలో కివీస్ దంచికొట్టింది. లాథమ్, శాంట్నర్ బౌండ్రీలే లక్ష్యంగా విరుచుకుపడటంతో.. ఆ జట్టు 18 బంతుల్లో 50 పరుగులు పిండుకుంది.
న్యూజిలాండ్: 322/7 (యాంగ్ 70, లాథమ్ 53; వాన్‌డెర్ మెర్వ్ 2/56, మీకెరెన్ 2/59),
నెదర్లాండ్స్: 46.3 ఓవర్లలో 223 ఆలౌట్ (అకెర్మన్ 69, ఎడ్వర్డ్స్ 30; శాంట్నర్ 5/59).