T20 World Cup | షార్జా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమయ్యారు. విండీస్‌ను గెలిపించేందుకు డియోండ్ర డాటిన్ బంతి (4/22)తో పాటు బ్యాట్ (22 బంతుల్లో 33, 3 సిక్సర్లు)తోనూ పోరాడినా ఫలితం వారికి అనుకూలంగా రాలేదు.
తొలుత కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. ప్లిమ్మర్ (33) టాప్ స్కోరర్. అయితే స్వల్ప ఛేదనలో విండీస్ కూడా తడబడింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు ఈడెన్ కార్సన్ (3/29), అమెలియా కెర్ (2/14) కట్టడి చేయడంతో వెస్టిండీస్.. 20 ఓవర్లలో 120/8కే పరిమితమైంది. డాటిన్ పోరాడినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు ఓటమి వైపున నిలిచింది.