Doug Bracewell | వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ డగ్ బ్రాస్వెల్పై ఆ దేశ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ నెల రోజుల నిషేధాన్ని విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో దేశవాళీ టీ20 మ్యాచ్ ఆడుతూ కొకైన్ వాడినట్టు వైద్య పరీక్షలో తేలింది.
వాస్తవానికి స్పోర్ట్ కమిషన్ బ్రాస్వెల్పై 3 నెలల నిషేధం విధించగా అతడు తన చర్యకు పశ్చాత్తాప్పడుతూ వైద్యం చేయించుకోవడంతో నిషేధాన్ని నెల రోజులకు తగ్గించింది. నిషేధ సమయం ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో అతడు మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.