Newzealand : ఈ నెలాఖరులో భారత పర్యటన రానున్నన్యూజిలాండ్ టీ20 జట్టును ప్రకటించింది. 15మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను శుక్రవారం వెలువరించింది. టీ20 జట్టుకి ఎంపికైన ఆటగాళ్ల పేర్లను బ్లాక్ కాప్స్ అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ‘మా టీ20 బృందం మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 రాంచీలో ఆడనుంది. న్యూజిలాండ్ పొట్టి క్రికెట్ జట్టుకు తొలిసారిగా సెలక్ట్ అయిన ఆక్లాండ్ క్రికెట్ ఆటగాడు బెన్ లిస్టెర్, కాంటెర్బురి క్రిక్కు చెందిన హెర్నీ షిప్లేలకు శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. బెన్ లిస్టెర్, ఆల్‌రౌండర్ హెన్రీ షిప్లేలు ఈ సిరీస్‌లో టీ20లో ఆరంగ్రేటం చేయనున్నారు. స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, ప్రధాన పేసర్ టిమ్ సౌథీ, విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గుఫ్తిల్కి చోటు దక్కలేదు. భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్నాయి. మొదటి టీ20 జనవరి 27న రాంచీలో జరగనుంది. రెండో టీ20కి లక్నో, మూడో టీ20 అహ్మదాబాద్ వేదిక కానున్నాయి.
కివీస్ టీ20 టీమ్ ఇదే..
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫ్ఫీ, ల్యూకీ ఫెర్గూసన్, బెన్ లిస్టెర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిఫ్స్, మైఖేల్ రిప్పన్, హెర్నీ షిప్లే, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నెర్.
మూడు వన్డేల సిరీస్ తర్వాత న్యూజిలాండ్, భారత్ టీ20లు ఆడనున్నాయి. జనవరి 18న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే, జనవరి 21న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, జనవరి 24న ఇండోర్‌లో మూడో వన్డే జరుగుతాయి.
Our T20 Squad to face India in 3 T20Is starting later this month in Ranchi! Congratulations to @aucklandcricket‘s Ben Lister and @CanterburyCrick‘s Henry Shipley on being selected in a BLACKCAPS T20 Squad for the first time. More | https://t.co/bwMhO2Zb76 #INDvNZ pic.twitter.com/jFpWbGPtGx
— BLACKCAPS (@BLACKCAPS) January 12, 2023