మౌంట్ మాంగనీ: అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్ మహిళలు.. ఈ ఫార్మాట్లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ 2003 నాటి రికార్డు బద్దలు కొట్టారు. పాంటింగ్ సేన అప్పట్లో వరుసగా 21 వన్డేలు నెగ్గి ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు అదే దేశానికి చెందిన మహిళల జట్టు దాన్ని తిరగరాసింది.
ఇవి కూడా చదవండి..