సన్ రైజ్ అయ్యేనా..

బలమైన ఓపెనింగ్.. మెరుగైన బౌలింగ్ వనరులున్నా.. మిడిలార్డర్లో దంచికొట్టే ఆటగాళ్లు లేక గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్‌కే పరిమితమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఎలాగైన టైటిల్ పట్టాలనే పట్టుదలతో ఉంది. బౌలింగ్ బలంతోనే బండిని లాగించే సన్‌రైజర్స్.. పాత ఆటగాళ్లపైనే నమ్మకముంచి ఇటీవలి వేలంలో పెద్దగా ఖర్చు పెట్టలేదు. ఫినిషర్ లోటు భర్తీ చేసేందుకు కొనుగోలు చేసిన కేదార్ జాదవ్ ఆ పాత్రకు ఏమేర న్యాయం చేస్తాడో చూడాలి! బ్యాటింగ్‌లో వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్, పాండే.. బౌలింగ్‌లో భువనేశ్వర్, నటరాజన్, సిద్ధార్థ్, రషీద్ ఖాన్ అందుబాటులో ఉండటం రైజర్స్ బలం కాగా.. అంచనాలు లేకుండా బరిలో దిగుతుండటం కలిసొచ్చే అంశం.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
నాణ్యమైన బౌలింగ్.. అగ్రశ్రేణి టాపార్డర్ అందుబాటులో ఉన్నా.. మిడిలార్డర్లో నిఖార్సైన ఆటగాళ్లు లేక ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 14వ సీజన్ కోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. లేట్‌గా వచ్చినా.. లేటేస్ట్‌గా అన్నట్లు.. ఐదేండ్లుగా ప్రతీ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరుతున్న సన్‌రైజర్స్ వార్నర్ సారథ్యంలో 2016లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడింది. ఆ తర్వాత 2018లో విలియమ్సన్ నాయకత్వంలో తుదిమెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక గత రెండు సీజన్లలోనూ ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఫైనల్ ఫైట్‌కు అర్హత సాధించలేకపోయింది. వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, జాసన్ రాయ్, మనీశ్ పాండే, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, వృద్ధిమాన్ సాహా, జాసన్ హోల్డర్‌తో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. అయితే దేశీయ ఆటగాళ్లలో మనీశ్ పాండే మినహా చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ లేకపోవడం సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెడుతున్నది. విజయ్ శంకర్‌పై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. గత సీజన్లో ఫర్వాలేదనిపించిన యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ నిలకడైన ప్రదర్శన కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. మిడిలార్డర్లో మంచి ఫినిషర్‌ను కొనుగోలు చేసుకోవాల్సిన సన్‌రైజర్స్.. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కేదార్ జాదవ్‌ను తీసుకుంది. ఇప్పటికే జట్టులో ఇద్దరు విదేశీ స్పిన్నర్లు ఉన్నా.. అదనంగా ముజీబ్‌ను తీసుకోవడం కూడా అనవసరమే. యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ కారణంగా టీమ్ఇండియా రేసులో వెనుకబడ్డ మనీశ్ పాండే తిరిగి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలంటే నిలకడగా రాణించాల్సిన అవసరముంది.
బౌలింగ్ భేష్..
డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించిన స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు యార్కర్ కింగ్ నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపీ, షాబాజ్ నదీమ్ రూపంలో హైదరాబాద్ బౌలింగ్ బలంగా ఉంది. సందీప్, సిద్ధార్థ్‌కు ఐపీఎల్లో అపార అనుభవం ఉండటం జట్టుకు కలిసొచ్చే విషయమైతే.. నటరాజన్ యార్కర్లు దీనికి అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి. ఇక స్పిన్ విభాగంలో ఆఫ్ఘన్ సంచలనం రషీద్ ఖాన్‌తో పాటు మహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహమాన్ అందుబాటులో ఉన్నారు.
భారత ఆటగాళ్లు: మనీశ్ పాండే, విరాట్ సింగ్, ప్రియం గార్గ్, వృద్ధిమాన్ సాహా, గోస్వామి, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, జగదీశ సుచిత్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, భువనేశ్వర్, నటరాజన్, సందీప్, ఖలీల్, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపీ, షాబాజ్ నదీమ్.
విదేశీ ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్, విలియమ్సన్, బెయిర్‌స్టో, రాయ్, నబి, హోల్డర్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్.
కొత్తగా కొనుగోలు చేసుకున్న వాళ్లు: కేదార్ జాదవ్ (రూ.2 కోట్లు), జగదీశ సుచిత్ (రూ.30 లక్షలు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.5 కోట్లు)
ఉత్తమ ప్రదర్శన
2016లో విజేత
2018లో రన్నరప్
బలాలు
- డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో రూపంలో ఇద్దరు మేటి ఆటగాళ్లు ఓపెనర్లుగా అందుబాటులో ఉండటం.
- జాసన్ రాయ్, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్, జాసెన్ హోల్డర్ రూపంలో వైవిధ్యమైన ఆటగాళ్లు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండటం.
- గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ తిరిగి అందుబాటులోకి రావడం.
- అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపుతున్న యార్కర్ కింగ్ నటరాజన్ ఫామ్.
- స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌కు నబి, ముజీబ్ అండ.
బలహీనతలు
- మిడిలార్డర్లో బాధ్యత తీసుకునే వాళ్లు లేకపోవడం.. చివరి వరకు నిలిచి మ్యాచ్‌లు ముగించే ఫినిషర్ కొరత ఉండటం.
- నలుగురు విదేశీ ఆటగాళ్ల నిబంధన హైదరాబాద్‌కు అతిపెద్ద సమస్య. వార్నర్, రషీద్ ఖాన్ అన్నీ మ్యాచ్‌లు ఆడటం ఖాయం కాగా.. మిగిలిన రెండు బెర్తుల్లో పరిస్థితులను బట్టి బెయిర్‌స్టో, రాయ్,
- విలియమ్సన్, హోల్డర్, నబికి అవకాశం దక్కనుంది.
- ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ ప్రభావం చూపలేకపోవడం.
- కొత్తగా కొనుగోలు చేసుకున్న కేదార్ జాదవ్ కూడా ఫామ్‌లో లేకపోవడం.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

