షార్జా: నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. షార్జా వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 19 పరుగుల తేడాతో (NEP vs WI ) మట్టికరిపించింది. దీంతో ఐసీసీలో టెస్టు హోదా కలిగిన ఓ జట్టుపై తొలిసారిగా విజయం సాధించింది రికార్డుల్లోకెక్కింది. 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం ఇరు జట్టు తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్టకష్టాలు పడిన విండీస్ జట్టు.. నేపాల్ బౌలర్లను ఎదుర్కోలేక 129 పరుగుల వద్ద చతికలబడింది. దీంతో 19 పరుగుల తేడాతో కరీబీయన్ జట్టుపై హిమాలయ దేశం విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది.
నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఆల్‌రౌండ్‌తో షోతో అదరగొట్టాడు. 35 బాల్స్‌లో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన పౌడెల్.. 3 ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. చేజింగ్‌లో నేపాల్‌కు వెస్టిండీస్ ఏ దశలో పోటీ నివ్వలేకపోయింది. రెండో ఓవర్లోనే 5 రన్స్ వద్ద ఓపెనర్ కైల్ మేయర్స్ వికెట్ కోల్పోయిన విండీస్ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ప్రత్యర్థికి మ్యాచ్‌ను సమర్పించుకుంది. కాగా, ఈ విజయాన్ని ఇటీవల జెన్-జెడ్ ఆందోళనల్లో మరణించిన వారికి అంకితమిస్తున్నట్లు నేపాల్ కెప్టెన్ పౌడేల్ ప్రకటించాడు.
NEPAL BEAT WEST INDIES IN A T20I. 🤯
– What a moment for Nepal cricket! ❤️ pic.twitter.com/IR7GKO1Eqz
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2025