దోహా: ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు కోయల్ బార్, నీలమ్దేవి రజత పతకాలతో సత్తాచాటారు. శనివారం జరిగిన 55కిలోల యూత్ విభాగంలో బరిలోకి దిగిన కోయల్ స్నాచ్‌లో 79కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 103కిలోలతో మొత్తం 182కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
55కిలోల జూనియర్ విభాగంలో నీలమ్దేవి 190కి(స్నాచ్‌లో 86కి+క్లీన్ అండ్జర్క్లో 104కి) రజతాన్ని ఖాతాలో వేసుకుంది. వీరిద్దరి ప్రదర్శనతో టోర్నీలో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే 40కిలోల విభాగంలో జోష్న సాబర్ 135కిలోలతో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.