కింగ్డొ (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ దశ మొదటి మ్యాచ్‌లో భారత్ 5-0తో మకావుపై ఘనవిజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలుత మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్-ఆద్య వరియత్ జంట 21-10, 21-9తో చొంగ్ లియోంగ్-వెంగ్ చిపై గెలిచింది.
పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-16, 21-12తో పంగ్ వంగ్ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-15, 21-9తో హావొ వై చన్‌పై గెలిచి ఆధిక్యాన్ని 3-0కు తీసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టి -ఎంఆర్ అర్జున్ ద్వయం.. 21-15, 21-19తో చిన్ పొన్ పుయ్-కొక్ వెన్ వాంగ్‌పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ 21-10, 21-5తో వెంగ్ చి-పుయ్ చి పై గెలిచింది. లీగ్ దశలో భారత్ గురువారం దక్షిణ కొరియాతో తలపడనుంది.