Hockey Player Died : జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా, హాకీ ప్లేయర్‌గా రాణిస్తున్న ఓ యుకెరటం జీవితం అర్ధాంతరంగా ముగిసింది. లక్నోలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జూలీ యాదవ్(Julie Yadav) అనే 23 ఏళ్ల అమ్మాయి దర్మరణం చెందింది. స్పోర్ట్స్ ఈవెంట్ కోసం స్కూల్‌కు వెళ్లిన ఆమె బండి మీద ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తను ప్రాణాలు కోల్పోయింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన జూలీ మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.
క్రీడల్లో రాణిస్తున్న జూలీ యాదవ్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో స్పోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తోంది. ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఆమె తన బండి మీద ఆదివారం స్కూల్‌కు కాస్త ముందుగానే వెళ్లింది. అయితే.. మొబైల్ ఫోన్ ఇంటి వద్దనే మర్చిపోయింది తను. ఫోన్ కోసం ఇంటికి వెళ్తుండగా.. గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్కు జూలీ బండిని ఢీకొన్నది.
ఈ ప్రమాదంలో ట్రక్కు టైర్ ఆమె మీద నుంచి వెళ్లింది. రక్తమోడుతున్న ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కానీ, మార్గం మధ్యలోనే తాను చనిపోయిందని వైద్యులు తెలిపారు. జూలీ మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు గుండలవిసేలా రోదించారు. యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.