Naomi Osaka : టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా(Naomi Osaka) ఆటతోనే కాదు తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ వైరలవుతుంటుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అనగానే ఈ జపాన్ ప్లేయర్ సరికొత్త డ్రెస్సింగ్స్ను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. నిరుడు యూఎస్ ఓపెన్‌లో ‘లబుబ్ డాల్స్’తో నెట్టింట వైరలైన తను.. ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)లో కూడా వినూత్న వేషధారణతో తళుక్కుమంది.
మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్ కోసం కోర్టుకు ఆమె ఆక్వా బ్లూ(సుమద్రపు నీలిరంగు)టై డై ట్రాక్‌సూట్ జాకెట్.. దానికి మ్యాచింగ్‌గా తెల్లని పలోజాను పోలిన వెడల్పాటి ప్యాంట్ ధరించింది. ముఖాన్ని కవర్ దాదాపుగా కవర్ చేసేలా తెల్లని మేలి ముసుగు, తెల్లని టోపీ, చేతిలో తెలుపు రంగు గొడుకు పట్టుకొని ఫ్యాషన్ సుందరిలా నడుస్తూ కోర్టులోకి విచ్చేసింది ఒసాకా.
El ¿outfit? de Naomi Osaka en su primer partido en Australia no va a dejar indiferente a nadie 😅😅😅#AO26 pic.twitter.com/XMQzbaLX05
— Eurosport.es (@Eurosport_ES) January 20, 2026
స్టయిల్ సింబల్‌గా పేరొందని ఒసాకా ఈసారి ‘ఆక్వా బ్లూ’ అండ్ వైట్ లుక్‌లో కోర్టులోకి రావడం చూసి ప్రేక్షకులే కాదు కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. తను అలా విభిన్న ష్యాషన్‌ను అనుసరించడం కొత్తేమీ కాదని తెలిసి.. ‘వావ్.. నువ్వు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తావు’ అని అనుకున్నారు.
కోర్టులో తన బెంచ్ వద్దకు చేరుకున్న ఒసాక.. ఛత్రీని, టోపీని తీసి పక్కన పెట్టింది. మేలి ముసుగును కూడా తీసేసి.. మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి రౌండ్లో క్రొయేషికాకు చెందిన ఆంటోనియా రుజిక్ను చిత్తుగా ఓడించింది ఒసాకా. రెండో సెట్ కోల్పోయిన నిర్ణయాత్మక సెట్లో దూకుడు కనబరిచి.. 6-3, 3-6, 6-4తో ప్రత్యర్ధిని మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లిందీ ఆసియా స్టార్.