SA vs NAM : పొట్టి క్రికెట్లో పెద్ద జట్లకు చిన్న జట్లు షాకివ్వడం చూస్తున్నాం. ఈమధ్యే వెస్టిండీస్‌పై సిరీస్ విజయంతో నేపాల్ (Nepal) చరిత్ర సృష్టించింది. ఇప్పుడు నమీబియా (Namibia) సైతం సంచలన ఆటతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఇరుజట్ల మధ్య జరిగిన ఏకైక టీ20లో సఫారీలపై 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రూబెన్ ట్రంపెల్మన్ (11 నాటౌట్, 3-28) ఆల్‌రౌండ్ షోతో అలరించగా ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో నమీబియా విక్టరీ కొట్టింది.
టీ20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపిస్తున్నాయి చిన్న టీమ్‌లు. ఇటీవలే రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌కు నేపాల్ చుక్కలు చూపెట్టింది. నేపాల్ స్ఫూర్తితో నమీబియా సైతం దక్షిణాఫ్రికాను ఓడించి అందర్నీ ఆశ్యర్యపరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్‌ను బౌలర్లు తక్కువకే కట్టడి చేశారు. ఓపెనర్ ప్రిటోరియస్ (22), స్మిత్(31), ఫార్టున్ బ్యాట్ ఝులిపించగా నిర్ణీత ఓవర్లలో సఫారీ టీమ్134 పరుగులు చేసింది.
HISTORIC – Namibia seal an incredible win vs South Africa at home 💪
Full scorecard ▶️ https://t.co/Je4HIyGh1c pic.twitter.com/2j7jkJBJTB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2025
అనంతరం ఛేదనలో నమీబియా గొప్పాగా పోరాడింది. కెప్టెన్ గెర్హాల్డ్ ఎరాస్మస్(21) రాణించగా.. ఆఖర్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్(30 నాటౌట్), ట్రంప్లెమాన్ (11 నాటౌట్) దంచేశారు. దాంతో.. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో గ్రీన్ సిక్స్, ఫోర్ బాదడంతో నమీబియా 4 వికెట్ల తేడాతో గెలుపొంది సఫారీలకు షాకిచ్చింది.
HISTORY IN WINDHOEK 😳
Namibia beat South Africa in their first-ever meeting. A dream start at their new home ground💥#NAMvSA pic.twitter.com/RW8daWpeu8
— FanCode (@FanCode) October 11, 2025