బ్యాంకాక్ : థాయ్లాండ్ ఓపెన్లో భారత బాక్సర్లు నమన్ తన్వర్, అన్శుల్ గిల్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల 90కిలోల సెమీస్ బౌట్లో నమన్ 4-1తో జురబోవ్ ఎలోర్బెక్(ఉజ్బెకిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు. 90+కిలోల సెమీస్ పోరులో అన్శుల్ 3-2తో రుస్తమోవ్ అబ్దుర్మకోవ్పై గెలిచాడు.
హోరాహోరీగా సాగిన ఈ రెండు బౌట్లలో తొలుత భారత బాక్సర్లు నమన్, అన్శుల్ తడబడ్డా..ఆ తర్వాత ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ బౌట్లను తమ వశం చేసుకున్నారు. మరోవైపు మహిళల విభాగంలో తమన్నా(51కి), ప్రియ(57కి), లాల్ఫక్వామాయి(80కి) ప్రత్యర్థుల చేతిలో ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు.