IPL 2024 KKR vs DC : వైజాగ్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగారు. దొరికిన బంతిని దొరికనట్టు స్టాండ్స్‌లోకి పంపారు. రెండు గంటల పాటు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కొనసాగించారు. దాంతో, వైజాగ్‌లో అత్యధిక సిక్సర్ల(15) రికార్డు కొట్టుకుపోయింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల స్కోర్ కొట్టింది. తద్వారా ఐపీఎల్లో అత్యధిక స్కోర్ బాదిన రెండో జట్టుగా కోల్‌కతా చరిత్ర సృష్టించింది.
మొదట ఓపెనర్ సునీల్ నరైన్(85) హాఫ్ సెంచరీతో చెలరేగగా… అరంగేట్ర కుర్రాడు అంగ్క్రిష్ రాఘువంశీ(54) ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోల్‌కతా బ్యాటర్ల వీరబాదుడు చూశాక ఐపీఎల్ రికార్డు స్కోర్ 277 బద్ధలవుతుంది అనిపించింది. కానీ, ఢిల్లీ బౌలర్లు చివర్లో అద్భుతంగా కోల్‌కతా హిట్టర్లను కట్టడి చేశారు.
Innovative!
Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd
— IndianPremierLeague (@IPL) April 3, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్‌కతాకు ఓపెనర్లు ఫిలిఫ్ సాల్ట్(15), నరైన్(85)లు శుభారంభమిచ్చారు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌తో నరైన్ పరుగుల వేట మొదలెట్టాడు. బౌలర్లు మారినా.. బంతి లక్ష్యం బౌండరీయే అన్నట్టు చెలరేగాడు. దాంతో, స్కోర్‌బోర్డు రాకెట్ వేగంతో పరుగులు తీసింది.
Sunil Narine at it again 🔥🔥@KKRiders are off to some start in Vizag!
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/UipTFUHznQ
— IndianPremierLeague (@IPL) April 3, 2024
ఆండ్రూ రస్సెల్(41), శ్రేయస్ అయ్యర్(18) విధ్వంసాన్ని కొనసాగిస్తూ.. కోల్‌కతా స్కోర్ 230 దాటించారు. చివర్లో.. రింకూ సింగ్(26) సిక్సర్లతో రెచ్చిపోవడంతో అయ్యర్ సేన భారీ స్కోర్ బాదింది. ఢిల్లీ బౌలర్లలో నార్జియా మూడు వికెట్లు పడగొట్టాడు.