హైదరాబాద్, ఆట ప్రతినిధి: రేసింగ్ అభిమాలను అలరించేందుకు మరో లీగ్ మనముందుకు రాబోతున్నది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్(ఐఆర్ఎఫ్)లో భాగంగా ఈ నెల 23 నుంచి మద్రాస్ ఇంటర్నేషనల్ సర్యూట్‌లో లీగ్‌కు తెరలేవబోతున్నది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల సమాహారంగా పోటీలు జరుగనున్నాయి. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నేతృత్వంలో బరిలోకి దిగుతున్నది. రేసింగ్ లీగ్‌లో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్‌కతా ప్రధాన పోటీదారులు. ఈసారి లీగ్‌కు నాగచైతన్య, అర్జున్‌కపూర్, సౌరవ్ గంగూలీ, జాన్ అబ్రహాం రూపంలో మరింత సెలెబ్రిటీ లుక్ రాబోతున్నదని ఆర్పీపీఎల్ ఎండీ, చైర్మన్ అఖిలేశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో యువ రేసర్లను ప్రోత్సహించడంతో పాటు రేసింగ్ అభివృద్ధిలో భాగంగా తాను లీగ్‌లో భాగమైనట్లు నాగచైతన్య తెలిపాడు.