హైదరాబాద్, ఆట ప్రతినిధి: వియత్నాం వేదికగా జూలైలో జరిగే ఆసియా పికిల్‌బాల్ జూనియర్ ఓపెనర్ చాంపియన్‌షిప్‌నకు తెలంగాణ నుంచి నాగ మోక్ష ఎంపికైంది.
భారత జూనియర్ జట్టు తరఫున నాగ మోక్ష ప్రాతినిధ్యం వహిస్తుందని ఆల్ఇండియా పికిల్‌బాల్ అసోసియేషన్(ఏఐపీఏ) గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న మోక్షకు జాతీయ జట్టులో చోటు దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.