అడుగు దూరంలో..
- ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు నాదల్
- గాయంతో సెమీస్‌లో వైదొలిగిన జ్వెరెవ్
మట్టి కోట మహరాజు రఫేల్ నాదల్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ పట్టేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకు తిరుగు లేదని మరోసారి నిరూపిస్తూ.. పుట్టిన రోజు (శుక్రవారం) నాడు రోలాండ్ గారోస్‌లో గర్జించాడు. రెండు సెట్లు పూర్తికాక ముందే ప్రత్యర్థి జ్వెరెవ్ గాయం కారణంగా తప్పుకోవడంతో నాదల్ రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. నేడు జరుగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్‌తో టాప్ సీడ్ స్వియాటెక్ అమీతుమీ తేల్చుకోనుంది.
పారిస్: పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ మరో టైటిల్‌కు చేరువయ్యాడు. మట్టి కోటలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలగడంతో నాదల్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. అంతకుముందు జరిగిన రెండు సెట్లలోనూ నాదల్ పైచేయి సాధించాడు. 7-6 (10/8), 6-6తో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో గాయం కారణంగా జ్వెరెవ్ ఆట నుంచి వైదొలిగాడు.
దీంతో నాదల్ 14వ సారి ఈ టోర్నీ ఫైనల్‌కు చేరాడు. గంటన్నర పాటు సాగిన తొలి సెట్లో నాదల్ కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టగా.. స్పెయిన్ బుల్ అనుభవం ముందు జ్వెరెవ్ నిలువలేకపోయాడు. రెండు సెట్లు కూడా పూర్తికాని మ్యాచ్ దాదాపు మూడున్నర గంటల పాటు సాగిందంటే ఇరువురు ఆటగాళ్లు ఏ స్థాయిలో పోరాడారో అర్థం చేసుకోవచ్చు. సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్ చెరో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రెండో స్థానంలో నిలువగా.. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గడం ద్వారా తన టైటిళ్ల సంఖ్యను 21కి పెంచుకున్న నాదల్.. ఆ సంఖ్యను మరింత పెంచుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. కోర్టులోనే 36వ పుట్టిన రోజు జరుపుకున్న నాదల్.. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెండో పెద్ద వయస్కుడిగా నిలిచాడు.
జ్వెరెవ్ విలవిల
మొదటి సెట్‌ను పోరాడి చేజార్చుకున్న జ్వెరెవ్ రెండో సెట్లో నువ్వానేనా అనే రీతిలో తలపడ్డాడు. 6-6తో స్కోర్లు సమం చేశాడు. ఈ సమయంలో నాదల్ సర్వీస్‌ను కొట్టేందుకు వేగంగా దూసుకొచ్చిన జ్వెరెవ్ కుడి కాలు మలుచుకుంది. వెంటనే కిందపడడంతో తీవ్రమైన మోకాలి నొప్పి వచ్చింది. దీంతో కోర్టులో విలవిలలాడాడు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది అత్యవసర చికిత్స అందించినా జ్వెరెవ్ కోలుకోలేకపోయాడు. చివరకు చేతికర్రల సాయంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది.
ఇది కఠినమైన మ్యాచ్. కానీ జ్వెరెక్కు అలా జరుగడం దురదృష్టం. టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ టూర్లో గొప్ప సహచరుడు జ్వెరెవ్. గ్రాండ్‌స్లామ్‌లో గెలువాలని ఎంతగా పోరాడాడో నాకు తెలుసు. అతడు ఒకటి కాదు.. చాలా గ్రాండ్‌స్లామ్‌లు గెలుస్తాడు. అతడికి నా అభినందనలు. – నాదల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

