Team India : ఐపీఎల్ సందడి ముగియడంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ జోష్ మొదలవ్వనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC)లో భాగంగా భారత జట్టు సొంత గడ్డపై అఫ్గనిస్థాన్‌ను ఢీ కొట్టనుంది. ఏకైక టెస్టు కోసం ఇప్పటికే స్క్వాడ్‌ను ప్రకటించిన సెలెక్టర్లు నెట్ బౌలర్‌గా అకీబ్ నబీ (Auqib Nabi)ని తీసుకున్నారు. నబీని స్క్వాడ్‌లోకి తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు నెట్ బౌలర్‌గా తీసుకున్నారు. ఐపీఎల్ 19వ సీజన్లో ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్ (Prince Yadav), గుర్జప్నీత్ సింగ్‌లు సైతం ఎంపికయ్యారు.
అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టుతో భారత జట్టు స్వదేశంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొంది డబ్ల్యూటీసీలో ముందంజ వేయాలని శుభ్‌మన్ గిల్ సేన ఆశిస్తోంది. దాంతో.. ధనాధన్ టీ20 నుంచి బ్యాటర్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు నెట్ బౌలర్లు కీలకం కానున్నారు. అందుకని.. అఫ్గన్ టెస్టుకు ముందే ఆరుగురు (ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు) యువకెరటాలను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
Auqib Nabi and Prince Yadav are among the seven net bowlers who will help India prepare for their one-off Test against Afghanistan in New Chandigarh starting June 6 https://t.co/YPmDLtm9y4 pic.twitter.com/zhUaWip4qF
— ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2026
జుమ్ముకశ్మీర్ తొలిసారి రంజీ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకమైన అకీబ్ నబీతో పాటు ఐపీఎల్ స్టార్లు ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్‌లు స్క్వాడ్‌తో కలువనున్నారు. కాబూలీ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు సరాన్ష్ జైన్(ఆఫ్ స్పిన్నర్), శివాంగ్ కుమార్(లెగ్ బ్రేక్), జీషన్ అన్సారీ(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్)లు నెట్స్‌లో భారత క్రికెటర్లకు బౌలింగ్ చేయనున్నారు. ముల్లన్‌పూర్‌లో జూన్ 6 నుంచి10వ తేదీ వరకు భారత్, అఫ్గనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుంది.
నెట్ బౌలర్లు : అకీబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్, సరాన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్.