Musheer Khan | ఐపీఎల్ చాన్స్ మిస్.. పొట్టి క్రికెట్‌ను మరింత అర్థం చేసుకుంటా
Musheer Khan : అండర్ -19 వరల్డ్ కప్‌లో దంచి కొట్టిన యువ కెరటం ముషీర్ ఖాన్(Musheer Khan) రంజీ ట్రోఫీలో సూపర్ సెంచరీ బాదాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి ముంబై(Mumbai) విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఫామ్‌తో అలవోకగా శతకాలు బాదేస్తున్న ముషీర్ ఐపీఎల్(IPL)లోనూ తన మార్క్...
Musheer Khan : అండర్ -19 వరల్డ్ కప్‌లో దంచి కొట్టిన యువ కెరటం ముషీర్ ఖాన్(Musheer Khan) రంజీ ట్రోఫీలో సూపర్ సెంచరీ బాదాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి ముంబై(Mumbai) విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి జోరు చూస్తుంటే త్వరలోనే అన్న సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) మాదిరిగా టీమిండియా తలపు తట్టేలా ఉన్నాడు. సూపర్ ఫామ్‌తో అలవోకగా శతకాలు బాదేస్తున్న ముషీర్ ఐపీఎల్(IPL)లోనూ తన మార్క్ చూపించాలని అనుకున్నాడు.
కానీ, అనూహ్యంగా నిరుడు మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ అతడిని కొనేందుకు ఆసక్తి చూపించలేదు. అయినా సరే ఐపీల్ ఆడడం లేదనే బాధ తనకు లేదని ముషీర్ అంటున్నాడు. ‘ఐపీఎల్లో నా పేరు లేదు. అందుకని నేను బాధ పడడం లేదు. టెస్టు క్రికెట్‌తో పాటు టీమిండియాకు ఆడాలని మా నాన్న చెప్తుంటారు. ఆ క్రమంలో ఐపీఎల్ చాన్స్ అదే వస్తుంది. ఈరోజు కాకుంటే రేపు ఐపీఎల్ ఆడుతా. ఓ రకంగా చాన్స్ మిస్ అవ్వడం నా మంచికే జరిగింది. టీ20 క్రికెట్‌ను మరింత అర్థం చేసుకొనే టైమ్ దొరికింది’ అని ముషీర్ తెలిపాడు.
ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్

ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలంలో ముషీర్ రూ.20 లక్షల కనీస ధరకు తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే.. ఈ యంగ్ ప్లేయర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. అతడి సోదరుడు సర్ఫరాజ్‌ను కూడా కనీస ధర రూ.20 లక్షలకు కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు.
136 పరుగులతో..
ముంబై తరఫున రాణిస్తున్న ముషీర్ ఇప్పటివరకూ 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడంతే. విదర్భతో జరిగిన ఫైనల్లో ఈ యంగ్‌స్టర్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో సీనియర్లు విఫలమైనా 136 పరుగులతో ముంబై భారీ స్కోర్‌లో భాగమయ్యాడు. తనుశ్ కొటియాన్, ధవల్ కులకర్ణిల విజృంభణతో ముంబై 169 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఆ జట్టు ఖాతాలో 42వ టైటిల్ చేరింది.
ఇవి కూడా చదవండి
- Murder Accused Live From UP Jail | నేను స్వర్గంలో ఉన్నా.. జైలు నుంచి హత్య కేసు నిందితుడి లైవ్ వీడియో
- E-Vehicle Policy: ఈ-వెహికల్ విధానాన్ని ఆమోదించిన కేంద్రం
- Mahabubabad | మంచి నీళ్ల కోసం రోడ్డెక్కిన జనం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

