Musheer Khan | అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం.. సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్
అన్నాదమ్ముళ్లు అదరగొట్టారు! భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత-‘ఎ’ జట్టు తరఫున భారీ సెంచరీతో కదంతొక్కితే.. అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్‌లో శతక్కొట్టాడు!
అన్నాదమ్ముళ్లు అదరగొట్టారు! భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత-‘ఎ’ జట్టు తరఫున భారీ సెంచరీతో కదంతొక్కితే.. అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్‌లో శతక్కొట్టాడు!
Musheer Khan | బ్లూమ్‌ఫాంటైన్: వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (118; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన పోరులో యువభారత్ 201 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఫలితంగా గ్రూప్‌లో అగ్రస్థానం ఖాయం చేసుకున్న యంగ్‌ఇండియా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన యువభారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 301 పరుగులు చేసింది. ముషీర్‌తో పాటు కెప్టెన్ ఉదయ్ శరణ్ (75) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో నమన్ తివారీ4, సామీ మూడు వికెట్లు పడగొట్టారు. ముషీర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ (165; 18 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో దుమ్మురేపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

