IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు వాంఖడే స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలుపొందిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలు ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారని చెప్పాడు పాండ్యా.
వాంఖడే మైదానంలో 10 ఏళ్లుగా బెంగళూరు ఓడిపోతూనే ఉంది. చివరిసారిగా 2015 ముంబైని చిత్తు చేసిన ఆర్సీబీ.. ఈసారి ఎలాగైనా ముంబైకి చెక్ పెట్టాలనే కసితో ఉంది. అయితే.. బుమ్రా, బౌల్ట్, చాహర్‌లతో కూడిన పేస్ దళాన్ని ఆర్సీబీ బ్యాటర్లు సమర్ధంగా ఎదుర్కొంటారా? అనేది ఆసక్తికరం.
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్, విల్ జాక్స్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, తిలక్ వర్మ, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విగ్నేశ్ పుతూర్.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియాం లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్) టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్.