ముంబై: ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్లో అత్యంత అభిమానుల ఆదరణ కలిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేసులో ముందుకెళ్లాలంటే రెండు టీంలకి ఈ మ్యాచ్ ముఖ్యమైనది.
ముంబై ఇండియన్స్
జోఫ్రా ఆర్చర్‌కు కోహ్లీ, డుప్లెసిస్లపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు చెత్త రికార్డు ఉంది. మరోవైపు పియూష్ చావ్లా బౌలింగ్‌లో మాక్స్వెల్ ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. పియూష్ చావ్లాను మినహాయిస్తే మిగిలిన ముంబై బౌలర్లపై మాక్స్‌వెల్‌కు మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. స్పిన్ బౌలింగ్‌లో మాక్స్వెల్ మూడు సార్లు ఔటయ్యాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఆడని తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అంతేకాకుండా రోహిత్ శర్మ ఫామ్ అందుకుంటేనే ముంబై మ్యాచ్ గెలిచేందుకు అధిక అవకాశాలు ఉంటాయి.
Playing XI (అంచనా): ఇషన్ కిషన్, గ్రీన్, రోహిత్, సూర్యకుమార్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, అర్షద్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కోహ్లీ, డుప్లెసిస్‌లకు ఈ గ్రౌండ్లో మంచి బ్యాటింగ్ రికార్డులు ఉన్నాయి. మరోసారి ఇలాంటి ప్రదర్శన చేస్తే విజయం సాధించడం సులభమవుతుంది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ మూడుసార్లు ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ కీలకం కానున్నాడు. అంతేకాకుండా గతంలో ఈ గ్రౌండ్లో 5 వికెట్లు తీసిన హసరంగ కీలకం కానున్నాడు.
Playing XI (అంచనా): డుప్లెసిస్, కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, మాక్స్వెల్, సూయాష్ ప్రభుదేశాయ్/అనుజ్ రావత్, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, హసరంగ, హర్షల్, హేజిల్‌వుడ్, సిరాజ్