ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. జోస్ బట్లర్(41: 32 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), జైశ్వాల్(32: 20 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), సంజూ శాంసన్(42: 27 బంతుల్లో 5ఫోర్లు), శివమ్ దూబే(35: 31 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు బట్లర్, జైశ్వాల్ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అర్థశతకాల దిశగా సాగుతున్న వీరిద్దరినీ రాహుల్ తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. పది ఓవర్లకే 91/2తో నిలిచిన రాజస్థాన్ మధ్య ఓవర్లలో మెరుపు బ్యాటింగ్ చేయలేకపోయింది. డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని రాయల్స్ కోల్పోయింది.
చివర్లో క్రీజులో కుదురుకున్న శాంసన్, దూబే వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించలేకపోయారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కూడా 171 పరుగులే చేయడం విశేషం.
Innings Break: It has been an eventful finish and #RR score 171-4 from their 20 overs. Yesterday, #SRH too had got 171 while batting first in Delhi.
— IndianPremierLeague (@IPL) April 29, 2021
Stay tuned as #MI openers will be on the park soon.https://t.co/jRroRGewsU #MIvRR #VIVOIPL pic.twitter.com/wT79HsjIpw