హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో ముంబై మీటియర్స్ గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై 3-0(15-9, 15-8, 15-12)తో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్పై అద్భుత విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ముంబై విజయంలో కీలకమైన కెప్టెన్ అమిత్ గులియాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై.. వరుస సెట్లలో కాలికట్ను చిత్తుచేసింది. ప్రత్యర్థి లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది.