IPL 2023 | ముంబై హ్యాట్రిక్ విజయం.. 178 పరుగులకు హైదరాబాద్ ఆలౌట్
IPL 2023 : ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 14 పరగులు తేడాతో గెలిచింది. కామెరూన్ గ్రీన్(64) వీర బాదుడుకు ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(37) మెరుపులు తోడవ్వడంతో ముంబై భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థిని 178 పరుగులకు ఆలౌట్ చేసింది.
IPL 2023 : ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 14 పరగులు తేడాతో గెలిచింది. కామెరూన్ గ్రీన్(64) వీర బాదుడుకు ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(37) మెరుపులు తోడవ్వడంతో ముంబై భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థిని 178 పరుగులకు ఆలౌట్ చేసింది. మయాంక్ అగర్వాల్(48), హెన్రిచ్ క్లాసెన్(36) ధాటిగా ఆడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దాంతో, హైదరాబాద్ ఓటమి పాలైంది.
భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్(9), రాహుల్ త్రిపాఠి(6)
ని జాసన్ బెహ్రన్‌డార్ఫ్ ఔట్ చేశాడు. మయాంక్ అగర్వాల్(48) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ మరక్రం(22)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే.. మరక్రం, అభిషేక్ శర్మ(1) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. దాంతో, 72 రన్స్‌కే నాలుగు కీలక వికెట్లు పడ్డాయి. ఆ దశలో హెన్రిచ్ క్లాసెన్(36) స్కోర్ వేగంగా ఆడి స్కోర్ 100 దాటించాడు. ఐదో వికెట్‌కు మయాంక్‌తో 50 రన్స్ జోడించాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్(10), వాషింగ్టన్ సుందర్ (10) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, పీయూష్ చావ్లా తలా రెండు వికెట్లు తీశారు. అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టాడు.
హాఫ్ సెంచరీ బాదిన గ్రీన్
ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. నాలుగు మ్యాచుల్లో విఫలమైన కామెరూన్ గ్రీన్(64) అర్ధ శతకంతో చెలరేగాడు. దాంతో, ముంబై 192 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(37) సిక్స్‌లతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, భువనేశ్వర్, నటరాజన్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్(38) ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టారు. దంచికొడుతున్నరోహిత్ను ఔట్ చేసి నటరాజన్ హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్, గ్రీన్ ఆచితూచి ఆడారు. జాన్సెన్ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్(7)ను ఔట్ చేసి ముంబైని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ సిక్స్‌లతో చెలరేగాడు. టిమ్ డేవిడ్(16) ఆఖర్లో ధాటిగా ఆడడంతో ముంబై భారీ స్కోర్ చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

