MI vs UPW : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (11), యస్తికా భాటియా (36) ధాటిగా ఆడుతున్నారు. వీళ్లు 37 బంతుల్లో 51 రన్స్ జోడించారు. ఎక్లెస్టోన్ ఓవర్లో మాథ్యూస్ ఎల్బీ కోసం యూపీ ఎల్బీకి అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో యూపీ రివ్యూ తీసుకుంది. అయితే.. రివ్యూలో మొదట ఔట్ అని , ఆ తర్వాత నాటౌట్ అని టీవీ అంపైర్ ప్రకటించాడు. అంతేకాదు యూపీ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు వదిలేయడంతో యస్తికా బతికిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు కొట్టింది. ఓపెనర్ అలిసా హేలీ (58), తహ్లియా మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీళ్ల జోరు చూస్తుంటే యూపీ 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, ముంబై స్పిన్నర్ సాయిక్ ఇషాక్ కీలక వికెట్లు తీసి యూపీని దెబ్బ కొట్టింది.