ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని.. లీగ్ చివరి దశకు వస్తున్నా కొద్ది కీలక విజయాలతో ముందడుగు వేసే ముంబై ఇండియన్స్.. ఈ సీజన్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. యూఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశలో వరుస ఓటముల తర్వాత ముంబై చావో రేవో లాంటి పోరులో సమిష్టిగా కదంతొక్కింది. పంజాబ్‌తో జరిగిన పోరులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్‌కు పనిచెప్పడంతో ఐదో విజయం నమోదు చేసుకున్న ముంబై.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది!
అబుదాబి: ముందడుగు వేయాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజృంభించింది. తొలుత బౌలింగ్‌లో సమిష్టిగా సత్తాచాటి పంజాబ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేసిన రోహిత్ సేన.. తర్వాత బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. ఫలితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. రెండో దశ మ్యాచ్‌ల కోసం యూఏఈలో అడుగుపెట్టాక ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి విజయం కాగా.. ఓవరాల్‌గా ఐదు విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ముంబై పట్టికలో ఐదో స్థానానికి చేరింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్మ్ (42) టాప్ స్కోరర్ కాగా.. దీపక్ హుడా (28), కెప్టెన్ లోకేశ్ రాహుల్ (21) ఫర్వాలేదనిపించారు. 48 కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మార్క్మ్,్ర దీపక్ జట్టుకు ఆ మాత్రం స్కోరు అందించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)రాణించారు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
స్కోరు బోర్డు
పంజాబ్: రాహుల్ (సి) బుమ్రా (బి) పొలార్డ్ 21, మన్దీప్ (ఎల్బీ) కృనాల్ 15, గేల్ (సి) హార్దిక్ (బి) పొలార్డ్ 1, మార్క్మ్ (బి) చాహర్ 42, పూరన్ (ఎల్బీ) బుమ్రా 2, దీపక్ హుడా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 28, హర్‌ప్రీత్ (నాటౌట్) 14, ఎలీస్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 135/6. వికెట్ల పతనం: 1-36, 2-39, 3-41, 4-48, 5-109, 6-123, బౌలింగ్: కృనాల్ 4-0-24-1, బౌల్ట్ 3-0-30-0, బుమ్రా 4-0-24-2, కౌల్టర్‌నైల్ 4-0-19-0, పొలార్డ్ 1-0-8-2, చాహర్ 4-0-27-1.
ముంబై: రోహిత్ (సి) మన్దీప్ (బి) రవి 8, డికాక్ (బి) షమీ 27, సూర్యకుమార్ (బి) రవి 0, సౌరభ్ (సి) రాహుల్ (బి) ఎలీస్ 45, హార్దిక్ (నాటౌట్) 40, పొలార్డ్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 19 ఓవర్లలో 137/4. వికెట్ల పతనం: 1-16, 2-16, 3-61, 4-92, బౌలింగ్: మార్క్మ్ 3-0-18-0, షమీ 4-0-42-1, అర్ష్‌దీప్ 4-0-29-0, రవి 4-0-25-2, ఎలీస్ 3-0-12-1, హర్‌ప్రీత్ 1-0-11-0.