PSL Franchise Owner Suicide : పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League)లో విషాదం నెలకొంది. ముల్తాన్ సుల్తాన్(Multan Sultans) జట్టు యజమాని అలంగీర్ తరీన్(Alamgir Tareen) ఆత్మహత్య చేసుకున్నాడు. లాహోర్‌లోని స్వగృహంలో ఈరోజు ఉదయం అతను విగత జీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని ముల్తాన్ సుల్తాన్ ఫ్రాంచైజీ నిర్ధారించింది. ‘మా ప్రియతమ యజమాని అలంగీర్ తరీన్ మరణ వార్తను మీకు తెలియజేయడానికి ఎంతో చింతిస్తున్నాం. ఈ విషాద సమయంలో మా ప్రార్ధనలు, ఆలోచనలు తరీన్ కుటుంబసభ్యులతోనే ఉంటాయి.
ఆయన ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అతడి ఆత్మకు శాంతి చేకూరాని ప్రార్ధిస్తున్నాం’ అని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపింది. పోలీసులకు తరీన్ గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. అయితే.. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అనేది మాత్రం వాళ్లు వెల్లడించలేదు.
2021లో పీఎస్ఎల్ ట్రోఫీ నెగ్గిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు
పాక్‌లో పెద్ద వ్యాపారవేత్త అయిన తరీన్కు ఆటలంటే చాలా ఇష్టం. దాంతో, అతను 2018లో తన మేనల్లుడు అలీ ఖాన్(Ali Khan)తో కలిసి సుల్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. 2021లో ముల్తాన్ జట్టు ట్రోఫీ విజేతగా నిలిచింది. అబుదాబీ వేదికగా జరిగిన ఫైనల్లో పెషావర్ జల్మీ(Peshawar Zalmi) జట్టును ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ ఏడాది కూడా ఫైనల్ చేరిన ముల్తాన్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఉత్కంఠ రేపిన ఫైనల్ పోరులో లాహోర్ క్యాలెండర్స్(lahore qalandars) గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.