World Cup 2019 | భారత అభిమానుల గుండె పగిలిన రోజు.. ధోనీ రనౌట్‌కు 4 ఏళ్లు
World Cup 2019 : వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత జట్టుపై భారీ అంచానాలే ఉంటాయి. శతకోటి ఆశలతో వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు సరిగ్గా నాలుగేండ్ల క్రితం ఇదే రోజు భారీ షాక్ తగిలింది. ఒక్క రనౌట్‌తో కోట్లాది మంది భారతీయ అభిమానుల గుండె పగిలింది. దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. మార్టిన్ గప్టిల్ విసిరిన సూపర్ త్రోకూ డగౌట్ బాట పట్టిన క్షణాన నిశ్శబ్దంగా రోధించిన హృదయాలకు లెక్కే లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో...
World Cup 2019 : వన్డే ప్రపంచకప్(World Cup) లాంటి మెగా టోర్నీలో భారత జట్టుపై భారీ అంచానాలే ఉంటాయి. శతకోటి ఆశలతో వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు సరిగ్గా నాలుగేండ్ల క్రితం ఇదే రోజు భారీ షాక్ తగిలింది. ఒక్క రనౌట్‌తో కోట్లాది మంది భారతీయ అభిమానుల గుండె పగిలింది. దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. మార్టిన్ గప్టిల్ విసిరిన సూపర్ త్రోకూ డగౌట్ బాట పట్టిన క్షణాన నిశ్శబ్దంగా రోధించిన హృదయాలకు లెక్కే లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో బరిలోకి దిగిన టీమ్ఇండియా రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన మెగా టోర్నీలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇంకేముంది మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్ సొంతమైనట్లే అని అభిమానులంతా అనుకుంటున్న సమయంలో భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
వర్షం కారణంగా రెండు రోజుల పాటు నిర్వహించిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. రాస్ టేలర్ (74), కేన్ విలియమ్సన్ (67) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న టీమ్ఇండియాకు ఈ లక్ష్యం ఎంత అని అభిమానులు ఆశిస్తే.. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే పరిస్థితి తలకిందులైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తలా ఒక పరుగు చేసి పెవిలియన్ చేరిపోయారు. దీంతో భారత్ 5/3తో కష్టాల్లో పడింది. దినేశ్ కార్తీక్ (6) కూడా విఫలం కాగా.. రిషబ్ పంత్ (56 బంతుల్లో 32), హార్దిక్ పాండ్యా (62 బంతుల్లో 32) పర్వాలేదనిపించారు. వీరిద్దరినీ శాంట్నర్ బుట్టలో వేసుకోవడంతో భారత్ 92/6తో నిలిచింది.
న్యూజిలాండ్‌పై ఎంఎస్ ధోనీ(50) రనౌట్

ఇక్కడి నుంచి రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77), మహేంద్రసింగ్ ధోనీ (72 బంతుల్లో 50) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ధోనీ నెమ్మదిగా ఆడినా.. జడ్డూ దంచికొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫలితంగా 47 ఓవర్లు ముగిసే సరికి భారత్ 203 /6తో నిలిచింది. విజయానికి 3 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉండగా.. మరో భారీ షాట్‌కు యత్నించిన జడేజా పెవిలియన్ చేరగా.. సిక్సర్‌తో అలరించిన ధోనీ.. రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. చివరకు మన జట్టు 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. దీంతో వరుసగా రెండో సారి భారత జట్టు ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
WC Qualifier Team 2023 | వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 జట్టు.. శ్రీలంక, జింబాబ్వే నుంచి ముగ్గురేసి క్రికెటర్లకు చోటు
Canada Open 2023 | కెనడా ఓపెన్ ఛాంపియన్ లక్ష్యసేన్.. ఫైనల్లో వరుస సెట్లలో గెలుపొందిన భారత షట్లర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

