WC Qualifier Team 2023 | వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 జట్టు.. శ్రీలంక, జింబాబ్వే నుంచి ముగ్గురేసి క్రికెటర్లకు చోటు
WC Qualifier Team 2023 : ఈ ఏడాది వరల్డ్ కప్ క్వాలిఫయర్(World Cup Qualifiers 2023) టోర్నమెంట్ ముగియడంతో ఐసీసీ(ICC) జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో విశేషంగా రాణించిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. టోర్నమెంట్ చాంపియన్ శ్రీలంక(Srianka), ఆతిథ్య జింబాబ్వే(Zimbabwe) నుంచి ముగ్గురేసి వరల్డ్ కప్ ...
WC Qualifier Team 2023 : ఈ ఏడాది వరల్డ్ కప్ క్వాలిఫయర్(World Cup Qualifiers 2023) టోర్నమెంట్ ముగియడంతో ఐసీసీ(ICC) జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో విశేషంగా రాణించిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. టోర్నమెంట్ చాంపియన్ శ్రీలంక(Srianka), ఆతిథ్య జింబాబ్వే(Zimbabwe) నుంచి ముగ్గురేసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ జట్టుకి ఎంపికయ్యారు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన లంక ఓపెనర్ ప్రథుమ్ నిస్సంక(Pathum Nissanka), మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga ), యువ స్పిన్నర్ మథీశ థీక్షణ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
జింబాబ్వే కెప్టెన్ సియాన్ విలియమ్స్(Sean Williams), సికిందర్ రజా, రిచర్డ్ గరవ క్వాలిఫయర్స్ జట్టుకి ఎంపిక్యారు. రన్నరప్ నెదర్లాండ్స్ జట్టు నుంచి విక్రమ్‌జిత్, బాస్ డి లీడె, స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edward).. స్కాట్లాండ్ క్రికెటర్లు బ్రాండన్ మెక్మిల్లెన్, క్రిస్ సోలె తుది జాబితాలో నిలిచారు.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ జట్టు : ప్రథుమ్ నిస్సంక, వనిందు హసరంగ, యువ స్పిన్నర్ మథీశ థీక్షణ, సియాన్ విలియమ్స్, సికిందర్ రజా, రిచర్డ్ గరవ, విక్రమ్‌జిత్, బాస్ డి లీడె, స్కాట్ ఎడ్వర్డ్స్, బ్రాండన్ మెక్మిల్లెన్, క్రిస్ సోలె.
ఇంటిదారి పట్టిన మాజీ చాంపియన్
ఈ ఏడాది వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో పది జట్టు పోటీ పడ్డాయి. చివరకు శ్రీలంక, నెదర్లాండ్స్ ఆ రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ టోర్నమెంట్లో ఎన్నో సంచలన విజయాలు నమోదయ్యాయి. నెదర్లాండ్స్ జట్టు సూపర్ ఓవర్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్(Westindies)కు షాకిచ్చింది. దాంతో, రెండు సార్లు వరల్డ్ కప్ నెగ్గిన విండీస్ ఇంటిదారి పట్టింది.
వెస్టిండీస్ జట్టు

ఆతిథ్య జట్టు జింబాబ్వే లీగ్ దశలో అద్భుతంగా ఆడినా సూపర్ సిక్స్ దశలో విఫలమైది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన శ్రీలంక జట్టు చాంపియన్‌గా నిలిచింది. నిన్న రాత్రి హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను 128 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5నుంచి భారత గడ్డపై జరగనుంది. నవంబర్ 19న టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి
Canada Open 2023 | కెనడా ఓపెన్ ఛాంపియన్ లక్ష్యసేన్.. ఫైనల్లో వరుస సెట్లలో గెలుపొందిన భారత షట్లర్
Mitchell Starc: మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్.. క్లీన్ బౌల్డ్ అయిన మొయిన్ అలీ.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

