Womens T20 World Cup : మహిళల పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా(Australia) రికార్డు స్కోర్ కొట్టేసింది. ఐసీసీ ఈవెంట్ అంటే చాలు రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించగా అత్యధిక పరుగులతో ఇంగ్లండ్ సరసన నిలిచింది. శనివారం సౌతాంప్టన్‌లో నెదర్లాండ్స్ బౌలర్లను ఓపెనర్ బేత్ మూనీ(74), అషే గార్డ్నర్(58)లు ఉతికేయడంతో కంగారూ టీమ్ అలవోకగా రెండొందలు బాదింది. ఆసీస్ కంటే ముందు ఇదే ఎడిషన్‌లో ఇంగ్లండ్ 219 పరుగులతో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
పొట్టి ఫార్మాట్లో మహిళా క్రికెటర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పదో సీజన్ టీ20 వరల్డ్‌కప్‌లో పోటీపడి ఆడుతూ అత్యధిక పరుగులు సాధిస్తున్నారు. టోర్నీ ఆరంభ పోరులో శ్రీలంకపై ఆతిథ్య ఇంగ్లండ్ 219 పరుగులతో రికార్డు నెలకొల్పింది. ఓపెనర్ డానీ వ్యాట్ హొడ్గే(105) శతకంతో చెలరేగగా.. అమీ జోన్స్(53), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(46) మెరిశారు. శనివారం ఆస్ట్రేలియా జట్టు ఆ రికార్డును సమం చేసింది.
Australia equal England’s record high from the opening night of this year’s #T20WorldCup 🤝 pic.twitter.com/zJfKMGbntl
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2026
సౌంతాప్టన్ మైదానంలో నెదర్లాండ్స్ బౌలర్ల భరతం పట్టిన బేత్ మూనీ(74), అషే గార్డ్నర్(58) అర్థ శతకాలతో కదం తొక్కారు. మూనీ రిటైర్ హర్టవ్వగా జార్జియా వరేహం(41) ఆఖర్లో దంచేసింది. ఈ ముగ్గురి విధ్వంసంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి 219 పరుగులతో ఇంగ్లండ్ సరసన నిలిచింది. మూడో అత్యధిక స్కోర్ సైతం ఇంగ్లండ్ పేరిటే ఉంది. 2023 ఎడిషన్లోపాకిస్థాన్పై ఇంగ్లండ్ 213 రన్స్ కొట్టింది.
Mooney and Gardner fifties and Wareham’s quickfire 41 power Australia to 219/6 against Netherlands – the joint-highest total at the Women’s T20 World Cup 💪 pic.twitter.com/D05Wx9o25p
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2026