లండన్: ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Sira)కు ఫైన్ వేశారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు.. నాలుగవ రోజును బెన్ డకెట్‌ను ఔట్ చేసిన తర్వాత అతను దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారణంగా సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అతనికి ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించారు. లార్డ్స్ టెస్టులో సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అయితే ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం అతను ఉల్లంఘనకు పాల్పడినట్లు ఐసీసీ పేర్కొన్నది. దురుసు భాష, చర్యలు, సంకేతాలు ఇవ్వడం ఆ రూల్ ప్రకారం నేరం అవుతుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో డకెట్ 12 రన్స్ చేసి ఔటయ్యాడు. మూడవ టెస్టు మ్యాచ్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 193 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 4 వికెట్లు కోల్పోయి 58 రన్స్ చేసింది. ఇవాళ అయిదో రోజు ఆట కీలకం కానున్నది.
5.3 Ducket Hit Reverse Sweep to Siraj
5.5 Ducket Got Out
Quite a send off By Siraj 🔥#ENGvsIND #LordsTest #siraj pic.twitter.com/N6eOGxPBbH— Raw Takes Only💅🏼 (@rawtakesonly) July 13, 2025