Mohammed Siraj : ఓవల్ టెస్టుతో మరోసారి నేషనల్ హీరో అయిపోయాడు సిరాజ్ (Mohammed Siraj). ఐదో రోజు మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లిన ఈ హైదరాబాదీ.. టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో అలుపెరగని యోధుడిలా బౌలింగ్ చేసి 23 వికెట్లు పడగొట్టిన ఈ పేస్ గన్.. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకున్న సిరాజ్ కెరీర్ ఆరంభం నుంచి గాయాలన్న మాటే ఎరుగడు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదుకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మియా భాయ్.. కచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తాడు. సిరాజ్ డైట్ గురించి అతడి సోదరుడు మహ్మద్ ఇస్లాయిల్ (Mohammed Ismail) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు ఏం చెప్పాడంటే…?
‘మా సోదరుడు సిరాజ్ ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. జంక్ ఫుడ్ అస్సలు తినడు. హైదరాబాద్‌లో ఉన్నా సరే బిర్యానీ కూడా అప్పుడప్పుడే తింటాడు. పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సిరాజ్ ధమ్ బిర్యానీ రుచి చూస్తాడు. అది కూడా ఇంట్లో వండినదై ఉండాలి. పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లాడు. తన శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తాడు సిరాజ్. డైట్, ఫిట్నెస్.. ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ రెండిటి విషయంలో అతడు క్రమశిక్షణను తప్పడు’ అని ఇస్మాయిల్ తన సోదరుడి ఫిట్నెస్ సీక్రెట్ వెల్లడించాడు.
Mohammed Siraj’s Brother via Amit Kumar on TOI:
“Siraj takes a lot of Inspiration from Virat, he is more than his elder brother – the agression and hunger, he has taken from Virat. In 2018, Siraj had a terrible IPL season, a lot of questions were raised but Virat bhaiya stood by… pic.twitter.com/0nv6KP1h1q
— Johns. (@CricCrazyJohns) August 5, 2025
సిరాజ్ ఇంతలా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఉందట. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. దాంతో, సిరాజ్ దిగులు చెందలేదు. ఎలాగైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవాలని.. ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాడు. ‘మా సోదరుడు మైదానంలోకి దిగాడంటే జట్టు కోసం ఏమైనా చేస్తాడు. వంద శాతం విశ్వాసంతో ఉంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానప్పుడు ఏమీ ఆందోళన చెందలేదు. బాధపడుతూ కూర్చోకుండా మరింతగా కష్టపడ్డాడు. ఉదయం, సాయంత్రం జిమ్‌లో గంటలకొద్దీ చెమటోడ్చుతూ ఫిట్నెస్ మెరుగుపరచుకున్నాడు’ అని ఇస్మాయిల్ తెలిపాడు.
𝘽. 𝙀. 𝙇. 𝙄. 𝙀. 𝙑. 𝙀 pic.twitter.com/ClrCat7IMJ
— Mohammed Siraj (@mdsirajofficial) August 4, 2025
ఓవల్ టెస్టు హీరో సిరాజ్.. నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ జారవిడిచినందుకు ఎంతో బాధపడ్డాడు. తన వల్లే జట్టు ఓటమి దిశగా సాగుతోందని భావించిన అతడు ఐదోరోజు నేనే గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకున్నాడు. తనకిష్టమైన ఫుట్‌బాలర్ రొనాల్డో ఫొటోను ఫోన్లో వాల్‌పేపర్‌గా పెట్టుకొని నేను సాధిస్తాను అని నమ్మాడు. అనుకున్నట్టే.. తొలి సెషన్ ఆరంభంలోనే డేంజరస్ జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. కాసేపటికే జోష్ టంగ్‌ను ప్రసిధ్ బౌల్డ్ చేయగా.. 143 కిలోమీటర్ల వేగంతో సంధించిన యార్కర్‌తో అట్కిన్సన్ను బౌల్డ్ చేసిన సిరాజ్ టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మియా భాయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Congratulations to Shri Mohammed Siraj, DSP!
For his stellar performance in India’s historic Test win against England!
Pride of Telangana | Hero in Uniform & Sport pic.twitter.com/K9pH247kgT
— Telangana Police (@TelanganaCOPs) August 4, 2025