కోల్‌కతా: టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఏడాది కాలం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కాలి గాయం తర్వాత ఆటకు దూరమైన షమీ.. రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) సెక్రటరీ నరేష్ ఓజా ఓ ప్రకటనలో తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందున్న నేపథ్యంలో షమీ ఈ మ్యాచ్‌లో ఫిట్నెస్ నిరూపించుకుని రాణిస్తే అతడిని ఆస్ట్రేలియాకు పంపించే అవకాశాలూ లేకపోలేదు.