హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెహ్రాడూన్ వేదికగా జరుగనున్న ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీలో భారత జట్టుకు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ కోచ్గా ఎంపికయ్యాడు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఆతిథ్య భారత్ సహా పలు దేశాలు పోటీపడుతున్నాయి.
ఆసియాలోని వివిధ దేశాల టాప్ స్కేటర్లు బరిలోకి దిగే టోర్నీలో భారత యువ స్కేటర్లు సత్తాచాటేందుకు మంచి అవకాశమని ఖాదిర్ పేర్కొన్నాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ మన స్కేటర్లు పతకాలు సాధిస్తారన్న నమ్మకముందని అన్నాడు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీలో 500మీ, 1000మీ, 1500మీ, టీమ్ రిలే ఈవెంట్లలో పోటీలు జరుగనున్నాయి.