సిడ్నీ: ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మిచెల్ స్టార్క్ 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో పునరాగమనం చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. 2011-12 సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ పేసర్.. తర్వాత మూడు సీజన్ల పాటు అదే జట్టుకు 4 మ్యాచ్‌లలోనే ప్రాతినిథ్యం వహించాడు.
2015 తర్వాత పూర్తిగా జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇచ్చిన స్టార్క్.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవలే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు డిసెంబర్ నుంచి మొదలుకాబోయే బీబీఎల్‌లో సిడ్నీ తరఫున ఆడనున్నట్టు సమాచారం. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో మొదలుకాబోయే యాషెస్ ముగిసిన (జనవరి 8) తర్వాత స్టార్క్ బీబీఎల్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తున్నది. కానీ అప్పటికి అతడు ఆడేది మూడు మ్యాచ్‌లు మాత్రమే.